కొడిమ్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
దిశ, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరి నారాయణ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జమల్పురి రాజేశ్వరి రాజేందర్, సింగిల్ విండో డైరెక్టర్లు కడారి మల్లేశం, నాగభూషణ్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడి వీరారెడ్డి, మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డి, వార్డు సభ్యుడు […]
దిశ, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరి నారాయణ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జమల్పురి రాజేశ్వరి రాజేందర్, సింగిల్ విండో డైరెక్టర్లు కడారి మల్లేశం, నాగభూషణ్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడి వీరారెడ్డి, మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డి, వార్డు సభ్యుడు చిలువేరి ప్రసాద్, ముమ్మడి స్వామి, రాజేశం,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.