ప్రణబ్ బతికున్నా.. కాంగ్రెస్ నేతలు చంపేస్తున్నారు
దిశ ప్రతినిధి, వరంగల్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ లీడర్లకు క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే ఆయన మృతి చెందాడని పలువురు వార్తలు ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణబ్ కుమారుడు అబిజిత్ ముఖర్జీ తండ్రి మరణ వార్తలపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని ట్విట్టర్ వేదికగా కోరారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జనగామ జిల్లా […]
దిశ ప్రతినిధి, వరంగల్:
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ లీడర్లకు క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే ఆయన మృతి చెందాడని పలువురు వార్తలు ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణబ్ కుమారుడు అబిజిత్ ముఖర్జీ తండ్రి మరణ వార్తలపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
తన తండ్రి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని ట్విట్టర్ వేదికగా కోరారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి ప్రణజ్ ముఖర్జీకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఫొటోలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.