ఘోర ప్రమాదం.. కారు యాక్సిడెంట్‌లో కాంగ్రెస్ నేతకు గాయాలు

దిశ, జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదంలో అడ్లూరి లక్ష్మణ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. వివరాల ప్రకారం.. లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనాన్ని, దండపెల్లి చెందిన యువకులు.. స్విఫ్ట్ డిజైర్ కారుతో ఓవర్ స్పీడ్‌లో ఢీకొట్టారు. ఈ క్రమంలో లక్ష్మణ్ […]

Update: 2021-08-31 07:09 GMT

దిశ, జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

అయితే, ఈ ప్రమాదంలో అడ్లూరి లక్ష్మణ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. వివరాల ప్రకారం.. లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనాన్ని, దండపెల్లి చెందిన యువకులు.. స్విఫ్ట్ డిజైర్ కారుతో ఓవర్ స్పీడ్‌లో ఢీకొట్టారు. ఈ క్రమంలో లక్ష్మణ్ కుమార్ వాహనం పూర్తిగా దెబ్బతిన్నది.

ధర్మపురిలో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను ముగించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ద్వారా తెలిసింది. కాగా ఈ వాహనంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు వెల్గటూర్ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలెందర్ రెడ్డి ఉన్నారు. అలాగే స్విఫ్ట్ డిజైర్ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

 

Tags:    

Similar News