కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్‌ఎస్ గూటికి బల్గూరి రాజేశ్వరరావు
దిశ, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బల్గూరి రాజేశ్వరరావు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు దళిత నాయకుడు అంబాల ప్రభాకర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు […]
దిశ, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బల్గూరి రాజేశ్వరరావు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు దళిత నాయకుడు అంబాల ప్రభాకర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గొప్పగా జరుగుతున్నాయని, రానున్న హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు ఎక్కటి సంజీవరెడ్డి, మ్యాడద తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.