రూ. 15 లక్షలు ఎక్కడ.. పరకాలలో టీఆర్ఎస్ నేతల ఆందోళన

దిశ, పరకాల: బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జన్ ధన్ ఖాతాల్లో రూ. 15 లక్షల నగదు వేస్తామని చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఎందుకు వేయలేకపోతున్నారో అనేది బండి సంజయ్ సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. గురువారం టీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ, సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో.. పరకాల పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండి సారంగపాణి మాట్లాడుతూ.. […]

Update: 2021-08-19 05:02 GMT

దిశ, పరకాల: బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జన్ ధన్ ఖాతాల్లో రూ. 15 లక్షల నగదు వేస్తామని చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఎందుకు వేయలేకపోతున్నారో అనేది బండి సంజయ్ సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. గురువారం టీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ, సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో.. పరకాల పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండి సారంగపాణి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ప్రకటించిన సంక్షేమ పథకాలే కాకుండా.. మేనిఫెస్టోలో లేని అనేక రకాల పథకాలను తీసుకువస్తూ ప్రజా సంక్షేమం కోసం పాడుతున్నారని కొనియాడారు. కేసీఆర్ సంక్షేమ పథకాలకు భయపడి తమ రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ ఆటంకంగా ఉంటుందోనని.. బీజేపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిజంగా సంజయ్‌కు సత్తా ఉంటే నరేంద్ర మోడీ ప్రకటించిన జన్ ధన్ ఖాతాలో నగదు వేయించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News