షెట్లూర్ దుర్ఘటనలో పరిహారమా.. పరిహాసమా..?

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, క్వారీ నిర్వహకుల ధన దాహం నలుగురు ప్రాణాలను పోట్టన పెట్టుకుంది. ఇసుక రీచ్ లకు అనుమతులను ఇచ్చి జిల్లా అధికార యంత్రాంగం చేతులు దులుపు కుంటే, నిబంధనలకు విరుద్ధంగా నదిగర్భంలో ఇసుకను త్రవ్వి నలుగురి ప్రాణాలను తోడేసారు క్వారీ నిర్వహకులు. దానిని యాధృచ్చికంగా, స్వీయ నిర్లక్ష్యంతో జరిగిన ఘటనగా, కామారెడ్డి జిల్లాలో శనివారం మంజీరా నదిలో నలుగురు జలసమాధైన ఘటనగా చిత్రికరిస్తున్నారు. చివరకు చర్చలు జరిపి […]

Update: 2021-06-26 07:50 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, క్వారీ నిర్వహకుల ధన దాహం నలుగురు ప్రాణాలను పోట్టన పెట్టుకుంది. ఇసుక రీచ్ లకు అనుమతులను ఇచ్చి జిల్లా అధికార యంత్రాంగం చేతులు దులుపు కుంటే, నిబంధనలకు విరుద్ధంగా నదిగర్భంలో ఇసుకను త్రవ్వి నలుగురి ప్రాణాలను తోడేసారు క్వారీ నిర్వహకులు. దానిని యాధృచ్చికంగా, స్వీయ నిర్లక్ష్యంతో జరిగిన ఘటనగా, కామారెడ్డి జిల్లాలో శనివారం మంజీరా నదిలో నలుగురు జలసమాధైన ఘటనగా చిత్రికరిస్తున్నారు. చివరకు చర్చలు జరిపి క్వారీ నిర్వహకులతో రూ.8 లక్షలు ఇప్పిస్తామని ఒప్పందంతో నలుగురి జలసమాధి కేసుకు గోరి కట్టినట్లు తెలిస్తోంది.

బీర్కూర్, బీచ్కుంధలో 6 ఇసుక రీచ్ లకు అనుమతి ఉంది. 31 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక త్రవ్వకాలకు అనుమతి ఉంది. ఇసుక మేటలను త్రవ్వాల్సిన నిర్వహకులు నదిగ ర్భంలో ఓక్కోచోట 5 నుంచి 10 మీటర్ల లోతుకు యంత్రాలతో తోడేస్తున్న రెవిన్యూ. ఖనిజ, ల్యాండ్ సర్వే, టియస్ యండిసి వారు ఎన్నడు కన్నేత్తి చూడలేదు. దానితో మంజీరా నదిలో లోతుగా త్రవ్వకాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. శుక్రవారం బీర్కూర్ శివారులోని మంజీర నదిని దాటుతూ రెండు కుటుంబాలకు చెందిన షెట్లూర్ గ్రామవాసులు నలుగురు గల్లంతైన విషయం శనివారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. శనివారం నలుగురి మృతదేహాలను వెలుగు చూసిన తరువాత పోలిస్ అధికార యంత్రాంగం హడావుడి మొదలైంది.

అప్పటికే అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు భాధిత కుటుంబాలకు ఓక్కోక్కరికి రూ.10 లక్షల డిమాండ్ చేశారు. కామారెడ్డి అదనపు ఎస్పీ అనోన్య, బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి పెద్ధ ఎత్తున బలగాలతో అక్కడికి చేరుకొని గోడవలు జరుగకుండా, బాధితులు అందోళన చేయకుండా బందోబస్తు మోహరించారు. అక్కడికి చేరుకున్న అర్డీవో రాజాగౌడ్ షెట్లూర్ సర్పంచ్ పండరితో చర్చలు జరిపారు. ప్రభుత్వం తరపున భాధితులకు ఎలాంటి నష్టపరిహరం ప్రకటన రాకపోవడంతో బాధిత కుటుంబాల్లో నైరాశ్యం నెలకోంది. క్వారీ నిర్వహకుల చేత పరిహరం రావడంతో ప్రభుత్వ పరిహరం ఇవ్వలేదని విమర్శలు వచ్చాయి.

Tags:    

Similar News