భూ వివాదం.. తహసీల్దార్ సస్పెండ్.. ఎంక్వైరీకి ఆదేశాలు..

దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం అసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ భూ వివాదం అధికారిపై వేటు పడేలా చేసింది. ఈ భూ వివాదంపై హైకోర్టులో సమర్పించిన నివేదికలు సరిగ్గా లేకపోవడంతో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్నే కారణంగా చూపుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చింతలమానేపల్లి తహసీల్దార్ బికర్ణ దాస్ ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా కోర్టులో కేసు […]

Update: 2021-09-18 09:13 GMT

దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం అసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ భూ వివాదం అధికారిపై వేటు పడేలా చేసింది. ఈ భూ వివాదంపై హైకోర్టులో సమర్పించిన నివేదికలు సరిగ్గా లేకపోవడంతో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్నే కారణంగా చూపుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చింతలమానేపల్లి తహసీల్దార్ బికర్ణ దాస్ ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా కోర్టులో కేసు కీలక దశలో ఉండగా అసలు వాస్తవం ఏమిటన్నది తెలుసుకునేందుకు ఈ భూవివాదంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా శనివారం చింతలమానేపల్లిలో జిల్లా రెవెన్యూ అధికారి కదం సురేష్, ఆసిఫాబాద్ ఆర్డీవో సిడాం దత్తుతో కలిసి ఫీల్డ్ విజిట్ చేశారు. జిల్లా లాండ్ సర్వే ఏడీ శ్యామ్ సుందర్, డీఐ జయరాం లతో కలిసి నక్షతో కొలతలు చేపట్టారు.

సంబంధిత పట్టేదార్‌ను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మా భూమి అని చెప్పినా వినకుండా తహసీల్దార్, రెవెన్యూ అధికారులు రాజకీయ ఒత్తిడితో పట్టాభూమిలో జబర్దస్తీగా, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టడం ప్రారంభించారని పిటిషనర్ కుమారుడు పేర్కొన్నారు. అంతేగాక స్థానికంగా పంచనామా చేసిన సమయంలో తమకు తహసీల్దార్ ఇచ్చిన పంచనామా కాపీ ఒకటి కాగా, హై కోర్టు కు సమర్పించిన కాపీ వేరేగా ఉందని వెల్లడించారు. తమకేమో మా భూమిలో ఎటువంటి కట్టడాలు కట్టడం లేదని పంచనామా కాపీ ఇవ్వగా, హై కోర్టుకు ఇచ్చిన పంచనామా నివేదికలో తేడా ఉందని డీఅర్ఓ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కదం సురేష్ మాట్లాడుతూ.. హై కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి పూర్తి వివరాలు డిటైల్డ్ గా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో విచారణ చేస్తున్నామని, పూర్తి వివరాలతో నివేదికను కలెక్టర్‌కు అందిస్తామని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News