కరోనాపై సమిష్టి యుద్ధం చేద్దాం

దిశ, ఆదిలాబాద్: సమిష్టిగా యుద్ధం చేస్తేనే కరోనా వైరస్ నివారించొచ్చని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ నివారణకు వైద్య శాఖ అధికారులతో శనివారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదైతే చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో చర్చించారు. అంతకుముందు ప్రభుత్వ పాలిటెక్నిక్, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల […]

Update: 2020-04-04 05:39 GMT

దిశ, ఆదిలాబాద్: సమిష్టిగా యుద్ధం చేస్తేనే కరోనా వైరస్ నివారించొచ్చని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ నివారణకు వైద్య శాఖ అధికారులతో శనివారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదైతే చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో చర్చించారు. అంతకుముందు ప్రభుత్వ పాలిటెక్నిక్, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల క్వారంటైన్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఉన్న వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి, కరోనా నియంత్రణ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ అతుల్ తదితరులు పాల్గొన్నారు.

Tags: corona virus, collector, mushrrar sharuqi, review

Tags:    

Similar News