యువకుడి చెంప చెల్లుమనిపించిన కలెక్టర్‌పై బదిలీ వేటు
దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో లాక్‌డౌన్ పర్యవేక్షిస్తున్న కలెక్టర్ అనవసరంగా బయటకు వచ్చిన ఓ యువకుడి సెల్ ఫోన్ పగులగొట్టాడు. అంతే కాకుండా అతనిపై చేయి చేసుకున్నాడు. అనంతరం అతన్ని కొట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇస్తున్న వీడియాలో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకివెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ కరోనా విధుల్లో భాగంగా లాక్‌డౌన్ ఎలా అమలవుతోందని రౌండ్స్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు సెల్‌ఫోన్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో లాక్‌డౌన్ పర్యవేక్షిస్తున్న కలెక్టర్ అనవసరంగా బయటకు వచ్చిన ఓ యువకుడి సెల్ ఫోన్ పగులగొట్టాడు. అంతే కాకుండా అతనిపై చేయి చేసుకున్నాడు. అనంతరం అతన్ని కొట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇస్తున్న వీడియాలో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకివెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ కరోనా విధుల్లో భాగంగా లాక్‌డౌన్ ఎలా అమలవుతోందని రౌండ్స్ వేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ యువకుడు సెల్‌ఫోన్ చూస్తు బయటకు వచ్చాడు.అతన్ని ఆపి ప్రశ్నించిన కలెక్టర్ ఆ యువకుడు చెప్పిన సమాధానానికి ఆగ్రహించాడు. వెంటనే అతని ఫోన్ తీసి నెలకేసి కొట్టాడు. ఆపై చెంప చెల్లుమనిపించాడు. ఈ దృశ్యాలను అక్కడున్న ఎవరూ ఎవరో వీడియో తీసి నెట్టింట పోస్టు చేయగా అది కాస్త వైరల్ అయ్యింది. దీనిపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందింది అతనిపై బదిలీ వేటు వేసింది.