ఇంట్లోకి దూసుకెళ్లిన బొగ్గు లారీ.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దులపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కనే గల ఇళ్లలోకి బొగ్గు లారీ దూసుకెళ్లి, బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇల్లు పూర్తిగా కూలిపోగా పక్కనే ఉన్న కిరాణా షాపు ధ్వంసమైంది. కాటారం ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున తాటిచెర్ల నుండి భూపాలపల్లి వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ ముద్దులపల్లి వద్ద ఓ ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ […]

Update: 2021-12-05 00:36 GMT

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దులపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కనే గల ఇళ్లలోకి బొగ్గు లారీ దూసుకెళ్లి, బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇల్లు పూర్తిగా కూలిపోగా పక్కనే ఉన్న కిరాణా షాపు ధ్వంసమైంది. కాటారం ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున తాటిచెర్ల నుండి భూపాలపల్లి వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ ముద్దులపల్లి వద్ద ఓ ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ సంఘటన జరిగిన సమయంలో పెద్ద శబ్ధం వినిపించింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబసభ్యులు బెంబేలెత్తిపోయారు. తేరుకుని చూసేసరికి ఇల్లు పూర్తిగా కూలిపోయి కనిపించింది. ఆ ఇల్లు పక్కనే ఉన్న షాపు రేకులు మొత్తం విరిగిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News