తెలంగాణలో లాక్‌డౌన్‌పై క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పలు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అటువంటి ప్రతిపాదనలేవీ ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కొవిడ్ కేసుల పెరుగుదలలో స్థిరత్వం వచ్చిందని వివరించారు. ప్రజలు ఇలాగే జాగ్రత్తలు పాటిస్తే మరో 3-4 వారాల్లో వైరస్ అదుపులోకి వస్తుందని సూచించారు. లాక్‌డౌన్ పెట్టాలనే ఆలోచన […]
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పలు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అటువంటి ప్రతిపాదనలేవీ ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కొవిడ్ కేసుల పెరుగుదలలో స్థిరత్వం వచ్చిందని వివరించారు. ప్రజలు ఇలాగే జాగ్రత్తలు పాటిస్తే మరో 3-4 వారాల్లో వైరస్ అదుపులోకి వస్తుందని సూచించారు. లాక్‌డౌన్ పెట్టాలనే ఆలోచన కానీ, ప్రతిపాదనలు కానీ ఏమీ ఇవ్వలేదని చెప్పారు. కనీసం అటువంటి ఉద్దేశం కూడా వైద్య ఆరోగ్యశాఖకు లేదన్నారు.