Gandhari: కష్టాల నౌకరీ.. పేరుకే పంచాయతీ కార్యదర్శులు

పని ఒత్తిడి భరించలేక గ్రామ కార్యదర్శులు గోస పడుతున్నారు.

Update: 2024-11-25 02:33 GMT

దిశ, గాంధారి: పని ఒత్తిడి భరించలేక గ్రామ కార్యదర్శులు గోస పడుతున్నారు. పేరుకే వారు పంచాయతీ కార్యదర్శులు! ప్రభుత్వ రంగంలోని పని విషయంలో ప్రతీ ఉద్యోగికి పరిధి అంటూ ఉంటుంది. కానీ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న వారి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ పని చేస్తే సరిపోతుంది అని కాకుండా.. అన్ని పనులు వారే చేయాల్సి వస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగిసి దాదాపు పది నెలలు అవుతున్న వేలవేల బోతున్న గ్రామపంచాయతీలకు సెక్రటరీ రూపంలో పోతున్న వన్నెను పోకుండా గ్రామపంచాయతీ కళ తప్పకుండా తమ వంతు ప్రయత్నం గా అహర్నిశలు పాటు పడుతూనే ఉన్నారు. సర్పంచ్ లేకుండానే గ్రామపంచాయతీలు ఇంకా పనిచేస్తున్నాయంటే కేవలం గ్రామపంచాయతీ సెక్రటరీ వన్ మెన్ షో గా మారి సర్పంచ్ లేకున్నా గ్రామపంచాయతీ సెక్రటరీ అనుకుంటే అన్ని చేయొచ్చు అని నిరూపిస్తున్నారు గ్రామపంచాయతీ సెక్రటరీలు. కలెక్టర్ వచ్చిన, ఆర్డీవో వచ్చిన, స్పెషల్ ఆఫీసర్ వచ్చినా ఏ పై స్థాయి అధికారి వచ్చిన అంతా చూసుకునేది సర్దుబాటు చేసేది ప్రస్తుతం సెక్రటరీ మాత్రమే.

వన్ మ్యాన్ షో గా సెక్రటరీల పనితీరు

సర్పంచులు ఉంటే సెక్రటరీలకు పని భారం తగ్గేది ఎందుకంటే ఏ వార్డులో ఏ సమస్య ఉన్న ఆ సమస్య ముందుగా క్షేత్రస్థాయిలో ఉన్న వార్డ్ మెంబర్ కు అటుపై సర్పంచ్ ఉప సర్పంచ్ సమక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలను వారే చూసేవారు కానీ ఇప్పుడు వారి లేని తరుణంలో ప్రత్యక్షంగా గ్రామపంచాయతీ సెక్రటరీ రంగంలోకి దిగి వార్డు వార్డులో గల సమస్యలను తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరించే దిశగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఏ వార్డులోనైనా మురికి కాలువలు, చెత్త పేరుకుపోయిన, బోర్లు పనిచేయకపోయినా, చెత్త బండి రాకపోయినా ఏ సమస్యకైనా ప్రతి సమస్యను తనదైన శైలిలో పనిచేస్తూ సమస్యను పరిష్కరించడంలో ముందుంటున్నారు. సమస్య వచ్చిందని ఆయా వార్డు వాసులు చెప్పడంతోనే ఆ సమస్యకు పరిష్కార మార్గం కొద్దిగా ముందో వెనకో మాత్రం పరిష్కారం చేస్తున్నారు.

తప్పని తిప్పలు..

కులగనన సర్వేకు వచ్చిన ప్రతి ఒక్క అధికారి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించుకొని రావడం ఆనవాయితీగా ఉన్నటువంటి వరకు కొనసాగింది అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే సదరు కులగననకు వెళ్లే అధికారులు మధ్యాహ్నం కూడా లంచ్ బాక్సులు తెచ్చుకోకపోతే సెక్రెటరీ దగ్గర ఉండి వాళ్లకు లంచులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొన్న వైనం.... సెక్రెటరీ కూడా ఎక్కడినుండి తేవాలో ఎలా నెట్టుకు రావాలో అడపాదడప అన్ని కష్టాలు పడి ఒక దారిన పడ్డాం అనుకునే లోపే సర్కారు వారు తీసుకొచ్చిన కులగన సర్వే నిర్వహించిన సర్టిఫికెట్లు ఆన్లైన్ ద్వారా ఎంట్రీ చేయించడం అది కూడా సెక్రటరీ లకు ఆ పని అప్పగించడంతో ఇంకా వారి పని పెనం మీద రొట్టెలా మారింది.... ఎందుకంటే ఇప్పటికే డబ్బులు అడపాదడపా వస్తుంటే అదనంగా ఒక్కొక్క ఫామ్ కు పది రూపాయల చొప్పున ఇచ్చి ఆన్లైన్లో గ్రామపంచాయతీ సెక్రటరీలు ఎంట్రీ చేస్తున్నారు. ఆన్లైన్లో ఎంట్రీ చేయించినందుకు పది రూపాయలు మొదటగా వీరి చేతి నుండి పెట్టుకొని తరువాత అటుపై రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేవరకు వేరే వారి వద్ద నుండి గాని వీడీసీ నుండి గాని తెలిసిన వారి దగ్గర నుండి గాని చేయిచాల్సిన పరిస్థితి నెలకొంది.

Tags:    

Similar News