దెబ్బలు పడతాయంటూ ప్రముఖ నటుడికి గట్టి వార్నింగ్ ఇస్తున్న యంగ్ బ్యూటీ.. (వీడియో)
యంగ్ బ్యూటీ శ్రీలీల అందరికీ సుపరిచితమే. ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీలీల అందరికీ సుపరిచితమే. ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోయింది. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈమె డ్యాన్స్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరసన రాబిన్ హుడ్ సినిమాలో, అక్కినేని అఖిల్ సరసన ఓ మూవీలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. రీసెంగ్‌గా వచ్చిన ‘పుష్ప-2’ సినిమాలో ఈ భామ ఐటెమ్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. దెబ్బలు ‘పడతాయ్ రాజా దెబ్బలు పడతాయి’ అని సాగే ఈ పాటలో తన డ్యాన్స్‌తో కిర్రాక్ అనిపించింది. ఇక ఈ సాంగ్‌కు చిన్నా, పెద్దా, ముసలి, ముతకా అని తేడా లేకుండా డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. శ్రీలీల, ప్రముఖ యాక్టర్ బ్రహ్మాజీ కలిసి దెబ్బలు పడతాయ్ రాజా సాంగ్‌కు రీల్ చేశారు. ఇందులో బ్రహ్మాజీ కూర్చొని వీడియో తీస్తుండగా శ్రీలీల తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దెబ్బలు పడతాయి అంటూ వార్నింగ్ ఇస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.