Sreeleela: ఊహించని క్యాప్షనిచ్చి.. ఫొటోలు షేర్ చేసిన శ్రీలీల
సినీ ఇండస్ట్రీకి ఏ ముహూర్తాన అడుగు పెట్టిందో గానీ.. టాలీవుడ్‌నే ఏలుతోంది కుర్ర హీరోయిన్ శ్రీలీల.
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీకి ఏ ముహూర్తాన అడుగు పెట్టిందో గానీ.. టాలీవుడ్‌నే ఏలుతోంది కుర్ర హీరోయిన్ శ్రీలీల(sreeleela). అంతకు ముందే కన్నడ(Kannada) వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ... తెలుగులో మాత్రం ఈ బ్యూటీ పెళ్లి సందడి(pelli sandhadi) చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 2019 లో కిస్(Kiss), భరాతే(Bharate) అనే రెండు చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెలుగులో ఈ అమ్మడు ఏకంగా టాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరో బాలకృష్ణ(Balakrishna) సినిమాలో అవకాశం కొట్టేసింది. భగవంత్ కేసరి(Bhagwant Kesari)లో బాలయ్య కూతురిగా చక్కగా నటించింది. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) సరసన గుంటూర్ కారం(Guntur Karam)లో, రామ్ పోతినేని(Ram Pothineni), పంజా వైష్ణవ్(Panja Vaishnav), నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), నితిన్ వంటి హీరోల సరసన అవకాశం దక్కించుకుంది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్(Pawan Kalyan) మూవీ(ఉస్తాద్ భగత్ సింగ్)లో నటిస్తోంది. రీసెంట్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప-౨(Pushpa-2) లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మాస్ స్టెప్పులేసి యువతను ఆకట్టుకుంది. ఇకపోతే శ్రీలీల సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. తరచూ యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఫొటోషూట్లతో అలరిస్తుంటుంది. తాజాగా ఈ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ లవ్ సింబల్స్ జోడించి..‘నీ హృదయంలో.. నీ మైండ్‌లో’(IN your heart ON your mind) అంటూ సింపుల్ శారీ ఫొటోలు పంచుకుంటూ ఈ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్రీలీల పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.