అల్లు అర్జున్ అరెస్ట్ పై వేణు స్వామి భార్య షాకింగ్ కామెంట్స్.. నేను ముందే చెప్పాగా అంటూ..

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-16 09:20 GMT

దిశ, సినిమా: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీని శుక్రవారం ఉదయం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు. అనంతరం జైలుకు తీసుకెళ్లేలోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తమకు సమర్పించిన పేపర్లలో సమాచారం సరిగ్గా లేదని చంచల్ గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉండి శనివారం ఉదయం రిలీజ్ అయి బయటకు వచ్చారు. అయితే బన్నీ అరెస్టును ఖండిస్తూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో వేణు స్వామి భార్య వీణ వాణి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా వేణు స్వామి భార్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో అల్లు అర్జున్ విడుదల అయి ఇంటికి రావడంతో తన కుటుంబ సభ్యులు ఆయనకు దిష్టి తీస్తున్నటువంటి వీడియోని షేర్ చేస్తూ.. ‘నేను ముందే చెప్పాను కదా దిష్టి తీయించుకోండని అప్పుడు నా మాట వినలేదు. పోనీలే ఇప్పుడైనా నా మాటపై కాస్త గౌరవం ఉంది. ఇప్పుడు మీకున్న దిష్టి మొత్తం తొలగిపోయింది. ఇకపై మీరు చేయాల్సిన పనులన్నింటినీ చేసేసుకోండి’ అంటూ రాసుకొచ్చింది.

కాగా పుష్ప-2 సినిమా చూసిన తర్వాత ఈమె అల్లు అర్జున్ నటన ఎంతో అద్భుతంగా ఉందని కళామతల్లి ఆశీస్సులు ఉంటే తప్ప అలా నటించడం సాధ్యం కాదని తెలిపారు. మీ నటనకు చాలా దిష్టి తగిలి ఉంటుంది. ఒక వంద గుమ్మడికాయలతో దిష్టి తీయించుకోండి అంటూ ఈమె సినిమా చూసిన తర్వాత మూవీ పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వీడియో చేశారు.

Full View

Tags:    

Similar News