Prashanth Varma: పుష్ప-2 పై ప్రముఖ డైరెక్టర్ ప్రశంసల వర్షం
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Tollywood famous director Sukumar) తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప-2’(Pushpa-2).
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Tollywood famous director Sukumar) తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప-2’(Pushpa-2). ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) హీరోగా నటించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న(National crush Rashmika Mandanna) కథానాయికగా నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వేట ఆగడం లేదు. భారీ వసూళ్లు కొడుతోన్న ఈ మూవీలో శ్రీలీల(sreeleela) కూడా భాగమైంది. ఐకాన్‌స్టార్ సరసన ఐటెమ్ సాంగ్‌లో గ్లామర్ స్టెప్పులేసి.. యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
పుష్ప పార్ట్- 2 రీలీజైన పది రోజుల్లోనే ఏకంగా 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు చేయడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ సక్సెస్ అందకున్న ఈ చిత్రంలోని నటీనటుల్ని అభినందించనివారు లేరు. తాజాగా హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించి.. ఫేమ్ దక్కించుకున్న ప్రశాంత్ వర్మ(Prashanth Varma) పుష్ప-2 పై పొగడ్తల వర్ష కురిపించారు. ఈ మూవీలోని ప్రతి ఒక్క సీన్ అందరినీ ఆకట్టుకున్నాయని అన్నారు. ప్రతీ డైలాగ్స్, ఎమోషన్స్ అన్ని అదుర్స్ అని చెప్పుకొచ్చారు.
తన అదర్భుతమైన నటనతో శ్రీవల్లి రూల్‌కు హీరోయిన్ రష్మిక మందన్న ప్రాణం పోసిందని వెల్లడించారు. ఇక దర్శకుడు సుకుమార్ అండ్ సంగీతాన్ని అందించిన దేవీశ్రీ ప్రసాద్(Devishri Prasad), ఈ మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers)కు స్సెషల్‌గా అభినందనలు తెలిపారు. పుష్పరాజ్(Pushparaj)గా బన్నీ అయితే తెరపై వైల్డ్ ఫైర్ అని.. ఐకాన్‌స్టార్ అనడానికి పుష్ప-2 నే నిదర్శనమని అల్లు అర్జును కొనియాడారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.