Brahmamudi: నందగోపాల్ కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్

కావ్యను పిలిచి నాకు డబ్బు కావాలి.. 3 లక్షలు తీసుకురా

Update: 2024-12-16 08:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

కావ్యను పిలిచి నాకు డబ్బు కావాలి.. 3 లక్షలు తీసుకురా అని ధాన్యం అడుగుతుంది. కావ్యను అడిగితే.. కావ్య షాక్ అయ్యి.. ‘మూడు లక్షలా? అంత డబ్బు ఎందుకుని అంటుంది. హేయ్ నువ్వు నన్ను మళ్ళీ ప్రశ్నలు అడగకు .. ‘చెప్పింది చెయ్’ అని ధాన్యం కోప పడుతుంది. దాంతో.. కావ్య వెళ్లి 3 లక్షలు తెచ్చి ఇస్తుంది. ఆ డిజైనర్‌కి డబ్బు మొత్తాన్ని ఇచ్చి నాకు మూడు అంటే మూడు రోజుల్లో చీర కావాలని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది ధాన్యం. వెంటనే కావ్యకు గట్టిగ క్లాస్ పీకుతుంది. ‘నలుగురిలో అలా ఎదురుతిరుగుతున్నావ్ .. నా పరువు తియ్యాలని చూస్తున్నావా.. ఎవరైనా ఉన్నప్పుడు ఇంకోసారి అలా ప్రశ్నించకు .. ’ అని సీరియస్ అవుతుంది.

ఇంకో వైపు అయోమయంలో రోడ్డు మీద నడుచుకుంటూ రాజ్ ను గమనిస్తూ కారు డ్రైవర్ వెనుకే కారు తీసుకుని వెళ్లి.. ఒక చోట ఆపి.. రాజ్ దగ్గరకు వెళ్లి.. ‘సార్ సార్ కారు ఎక్కండి’ అని ఎక్కించుకుని వెళ్తుంటాడు. అప్పుడే రాజ్ షాక్ నుంచి బయటకు వచ్చి.. తెలిసిన పోలీస్ ఆఫీసర్‌కి ఫోన్ చేసి.. నందగోపాల్ డిటైల్స్ చెప్పి .. విచారించాలని అడుగుతాడు. వాడ్ని ఎలా అయిన పట్టుకోమని చెబుతాడు. అప్పుడే రాజ్‌కి నందగోపాల్ ఇంటి అడ్రస్ తెలియగానే అతను కూడా అక్కడికే బయలుదేరతాడు . ‘నేను వీడిని ఎలా అయినా పట్టుకుంటాను..మీరేం కంగారు పడకండి ’ అని పోలీస్ ఆఫీసర్ రాజ్‌కి చెబుతాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది. 

Tags:    

Similar News