Prabhas: సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌కు గాయం.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్! (ట్వీట్)

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం రాజాసాబ్(Raja Saab), కల్కి-2, సలార్-2(Salar-2), స్పిరిట్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

Update: 2024-12-16 08:59 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం రాజాసాబ్(Raja Saab), కల్కి-2, సలార్-2(Salar-2), స్పిరిట్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే ఆయన హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. అయితే ‘రాజాసాబ్’(Raja Saab) త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ప్రభాస్‌ షూటింగ్‌లో గాయపడినట్లు నెట్టింట పలు పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. #ప్రభాస్ పేరుతో నెటిజన్లు షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.

అసలు అందులో ఏముందంటే.. జపాన్‌లో వచ్చే నెల 3వ తేదీన విడుదల కానున్న ‘కల్కి’ ప్రమోషన్లకు తాను హాజరవట్లేదని. షూటింగ్ సమయంలో తనకు కాలు బెనికిందని అందుకే వెళ్లలేకపోతున్నానని, డిస్ట్రిబ్యూటర్ల టీమ్ పాల్గొంటుందని ఆయన ప్రకటించినట్లు ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా ఆందోళన చెందుతున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కానీ డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం అందులో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని అంటున్నారు. ఇక దీనిపై క్లారిటీ రావాలంటే టీమ్ స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

Tags:    

Similar News