Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ టీజర్‌‌ రిలీజ్ డేట్ ఫిక్స్.. కుర్రాళ్లను ఫిదా చేస్తున్న రష్మిక పోస్టర్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది.

Update: 2024-12-07 08:12 GMT

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది. ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పుడు మరో రెండు చిత్రాలతో రాబోతుంది. ప్రస్తుతం టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి(Dheekshith Shetty) సరసన రష్మిక నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend). ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్(Geetha Arts), మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని(Dheeraj Mogilineni) ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్(Teaser) డిసెంబర్ 9వ తేదీన రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా రష్మిక మందన్న పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక అది చూసిన కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. వైవిధ్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో విడుదల కానుంది.

Tags:    

Similar News