‘ఆషీకీ-3’ నుంచి యానిమల్ బ్యూటీని తప్పించిన నిర్మాతలు..? కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-10 04:31 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ భామకు వరుస అవకాశాలు వస్తూ చేతినిండా చిత్రాలతో బిజీ బిజీగా ఉంది. ఇక బాలీవుడ్‌లో శ్రద్ధాకపూర్, ఆదిత్య రాయ్ కపూర్ జంటగా నటించిన ‘ఆషీకీ-2’ సినిమా ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా మూడో భాగం కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ‘ఆషీకీ-3’ లో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి ఓకే అయింది. స్టార్టింగ్‌లో చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్‌గా ఈ ముద్దుగుమ్మను ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

తాజా సమాచారం ప్రకారం ‘ఆషీకీ-3’ నుంచి త్రిప్తి దిమ్రిని మేకర్స్ తప్పించారని బాలీవుడ్‌లో ఓ వార్త వినిపిస్తుంది. అయితే మేకర్స్ అనుకున్నంత రేంజ్‌లో ఈ భామ పెర్ఫామ్ చేయడం లేదని, బాగా ఎమోషనల్‌గా నటించే హీరోయిన్ అయితే బాగుంటుంది అని, ఆమె ఆ రోల్‌కి సూట్ కావడం లేదని పక్కన పెట్టేశారట. దీంతో మరో న్యూ హీరోయిన్ కోసం మేకర్స్ తెగ వెతికేస్తున్నారట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Tags:    

Similar News