Game Changer: గేమ్ ఛేంజర్‌లో ఆమె క్యారెక్టర్ హైలైట్ అంటున్న జనం.. సూపర్ సస్పెన్స్ దాచిన శంకర్?
ఈ ముద్దుగుమ్మ ప్రాణం పెట్టే నటించిందని .. అలాగే, డీ గ్లామరస్ లుక్ లో చించేసిందని చెబుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా తెరకెక్కిన మూవీ "గేమ్ ఛేంజర్" ( Game Changer) శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, అంజలి వంటి నటీ నటులు నటించారు. భారీ అంచనాల నడుమ నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అయితే, సినిమా చూసిన వారందరూ రామ్ చరణ్ తర్వాత ఆమె గురించే ఎక్కువ చెబుతున్నారు. ఆమె ఎవరో ఇక్కడ చూద్దాం..
రామ్ చరణ్ " గేమ్ ఛేంజర్ "మూవీలో ద్విపాత్రాభినయం చేసిన విషయం మనకీ తెలిసిందే. అయితే, ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న పాత్రకి జోడిగా అంజలి ( Anjali ) నటించింది. కథ స్లో అవుతున్న సమయంలో ఈమె క్యారెక్టర్ మలుపు తిప్పిందని ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ప్రాణం పెట్టే నటించిందని .. అలాగే, డీ గ్లామరస్ లుక్ లో చించేసిందని చెబుతున్నారు. ముఖ్యంగా, ఆమె నటవిశ్వరూపం చూడటానికైనా సినిమాని చూడాల్సిందే అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.