విడుదల రోజే ‘గేమ్ ఛేంజర్’కు BIG షాక్.. ఆన్‌లైన్‌లో HD ప్రింట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్(Game Changer Movie) చిత్రానికి విడుదల రోజే భారీ షాక్ తగిలింది.
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్(Game Changer Movie) చిత్రానికి విడుదల రోజే భారీ షాక్ తగిలింది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో విడుదలైన ఈ సినిమా.. విడుదలై కనీసం ఒక్క రోజైనా పూర్తి కాకముందే హెచ్‌డీ ప్రింట్ నెట్టింట్లో వైరల్‌గా మారినట్లు వార్తలు విస్తృతమయ్యాయి. దీంతో చిత్రబృందంతో పాటు చరణ్ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అంటూ సినీ వర్గాలు పైరసీని సోషల్ మీడియా వేదికగా ఖండిస్తున్నాయి.
అయితే, ఈ పైరసీపై మేకర్స్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్లలో సినిమను ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. గేమ్ ఛేంజర్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. రామ్ చరణ్, తమన్ ఇద్దరూ సినిమాను భుజానా వేసుకొని అదరగొట్టారని.. అయితే దర్శకుడు శంకర్(Shankar) నుంచి ఊహించిన స్థాయిలో లేదని అన్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి(Anjali), శ్రీకాంత్(Srikanth), సునీల్, ఎస్‌జే సూర్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు.