Game Changer:‘చరణ్.. అప్పన్న క్యారెక్టర్‌లో ఇరగదీశావ్’.. మెగా హీరో ప్రశంసలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer) నేడు(జనవరి 10) థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer) నేడు(జనవరి 10) థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ సోలోగా నటించిన ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూశారు. ఇక నేడు భారీ అంచనాల మధ్య గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ మూవీ పై పలువురు తెలుగు హీరోలు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపారు.
ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ సినిమా పై మెగా హీరో(Mega Hero) సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ మూవీ పై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చరణ్.. అప్పన్న క్యారెక్టర్‌లో ఇరగదీశావ్. ఆ పాత్రకు జీవం పోశావ్. పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా మారినట్లు అనిపించింది. ఈ సినిమాను అందించినందుకు శంకర్‌కు ధన్యవాదాలు. నాకు చరణ్ నటించిన మూవీల్లో మగధీరలో హర్ష& కాలభైరవ, ఆరెంజ్‌లో రామ్, రంగస్థలంలో చిట్టిబాబు, RRRలో అల్లూరి సీతారామరాజు ఇప్పుడు అప్పన్న పాత్రలంటే ఇష్టం’’ అని తెలిపారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.