Shobhita Dhulipala: డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చిన అక్కినేని కోడలు.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ మనందరికీ సుపరిచితమే.

Update: 2025-01-10 03:19 GMT

దిశ, సినిమా: అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ మనందరికీ సుపరిచితమే. నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత అతనితో డేటింగ్‌లో ఉంటూ సీక్రెట్ ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ ఒకే దగ్గర ఉన్న ఫొటోలు బయటకు వచ్చినప్పటికీ వాటిపై ఈ జంట స్పందించలేదు. అయితే ఆగస్టు 8న డేటింగ్ రూమర్స్‌ను నిజం చేస్తూ చైతన్య- శోభితలు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున తెలపడంతో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఇక డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట గ్రాండ్‌గా పెళ్లి కూడా చేసుకున్నారు.

అయితే ప్రస్తుతం చైతన్య ‘తండేల్’ మూవీ కోసం తెగ కష్టపడిపోతున్నాడు. శోభిత మాత్రం లేటెస్ట్ ఫొటో షూట్ చేస్తూ నిత్యం తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శోభిత తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకుని జుట్టంతా వదులుకుని డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఇక ఈ పిక్స్‌కి ‘హాయ్’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ‘ఏంటి ఇలా తయారయ్యావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Full View

(Post Credit's to Sobhita Dhulipala Official Instagram Photo's)

Tags:    

Similar News