Pushpa 2 : దంగల్ రికార్డ్ పై కన్నేసిన అల్లు అర్జున్ .. చైనా రిలీజ్ కి రెడీ అవుతున్న పుష్ప 2
తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లో కూడా దూసుకెళ్తుంది
దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా నటించిన పుష్ప-2 ( Pushpa 2 )మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా కూడా జాతర కంటిన్యూ అవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లో కూడా దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే రూ. 1831 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసింది. టాప్ 2 గా నిలిచిన బాహుబలి 2 కూడా పుష్పరాజ్ బీట్ చేశాడు.
జనవరి 17 నుంచి మరో 20 నిమిషాలు యాడ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో, మరోసారి పుష్ప-2 కు క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో " దంగల్ " టాప్ వన్‌లోఉంది. ఇప్పుడు పుష్పరాజ్ చూపు దంగల్‌పై పడింది. దంగల్ కలెక్షన్లను బీట్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. దంగల్ రూ. 2000 కోట్లు వసూలు చేసింది. ఇంత వరకు ఈ రికార్డు ను ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. ఇప్పుడు, ఆ రికార్డ్ అందుకునే అవకాశం ఒక్క అల్లు అర్జున్ కి మాత్రమే ఉంది. పుష్ప-2 మూవీని కూడా చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో దీని గురించి అధికారక అనౌన్స్‌మెంట్ కూడా రానుంది. మరి, దంగల్ రికార్డ్ ను బీట్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సెట్ చేస్తాడా.. లేదనేది తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.