Kora Movie: ఊచకోతకు రెడీ అంటున్న సునామీ కిట్టి.. ‘కోరా’ నుంచి ఫస్ట్ లుక్
కన్నడ స్టార్ (Kannada Star) యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా (Dhruv Sarja) సమర్పణలో వస్తున్న తాజా చిత్రం ‘కోరా’ (Kora).
దిశ, సినిమా: కన్నడ స్టార్ (Kannada Star) యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా (Dhruv Sarja) సమర్పణలో వస్తున్న తాజా చిత్రం ‘కోరా’ (Kora). సునామీ కిట్టి, చరిష్మా, పి మూర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని డైరెక్టర్ ఒరటాశ్రీ (Oratashree) తెరకెక్కించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ పతాకాలపై డాక్టర్ ఎబి నందిని, ఎఎన్ బాలాజీ, పి మూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కోరా’ నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ (First Look Poster)ను విడుదల చేశారు చిత్ర బృందం.
ఇక పోస్టర్‌ను గమనిస్తే హై ఆక్టేన్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రం రాబోతున్నట్లు అర్థం అవుతోంది. సునామీ కిట్టిని ఆగ్రహావేశాలు ఈ లుక్‌లో కనిపిస్తున్నాయి. అతని ముఖం మీద గాయాలు, ఇంటెన్స్ లుక్‌ని చూస్తుంటే ఊచకోత కోసేందుకు రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action Entertainer) గా ‘కోరా’ చిత్రం రూపొందుతున్నట్లు అర్థం తెలుస్తోంది. కాగా.. ఎం.కె.మాత, మునిరాజు, నీనాసం అశ్వత్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీలో రూపొందుతుంది.