ఇయర్ ఎండింగ్‌లో నాకు ఇష్టమైన పనిచేస్తున్నాను.. ప్రభాస్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దిశ, సినిమా: ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలా అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఓ ఊపు ఊపిన ఈ బ్యూటీ.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడింది. కొన్నేళ్లు లవ్ చేసుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక మ్యారేజ్ తర్వాత అంతంతగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంది.
ఆ తర్వాత ‘సత్యభామ’, ‘భగవంత్ కేసరి’ వంటి సినిమాలతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కాజల్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో మేకప్ రూమ్‌లో ఉన్న పిక్‌ను షేర్ చేస్తూ.. ‘ఇయర్ ఎండింగ్‌లో నాకు ఇష్టమైన పనిచేస్తున్నాను’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.