నా చుట్టూ ఉన్నవాళ్లే నన్ను అలా చేశారు.. సూసైడ్ అటెంప్ట్ కూడా.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
యంగ్ హీరో షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కెరీర్ స్టార్టింగ్‌లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్‌లతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
దిశ, సినిమా: యంగ్ హీరో షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కెరీర్ స్టార్టింగ్‌లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్‌లతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో మాత్రం ఏకంగా స్టార్ యూట్యూబర్‌గా ఎదిగాడు. దీంతో బిగ్ బాస్ సీజన్-5 లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి.. అక్కడ తన గేమ్స్, స్ట్రాటజీతో రన్నరప్‌గా నిలిచాడు. అయితే హౌస్‌లో కో కంటెస్టెంట్ అయిన సిరి హన్మంతుతో ప్రేమాయణం నడిపాడు. దీంతో తన ప్రియురాలు అయినటువంటి దీప్తి సునైన షన్నుకి బిగ్ బాస్ నుంచి రాగానే బ్రేకప్ చెప్పేసింది. అంతేకాకుండా ఓ యాక్సిడెంట్ కేసు, గంజాయి తాగాడని ఆరోపణలు, వాళ్ల అన్నయ్యకు సంబంధించిన కేసు ఇలా ఎన్నో వివాదాల్లో నిలిచాడు. ఇక వీటన్నిటి తర్వాత ఆఫ్టర్ ఓ లాంగ్ గ్యాప్ తీసుకుని ‘లీలా వినోదం’ అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇదిలా ఉంటే.. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షన్నూ అక్కడ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘కాలేజీ చదువు కోసం ఎక్కడో దూరంగా బెంగుళూరులో అమృత యూనివర్సిటీలో వేశారు. కానీ నాకు యాక్టింగ్ మీద పిచ్చి. దాంతో మా నాన్నకు నా లెఫ్ట్ బ్రెయిన్ కొంచెం హెవీ అయింది నేను చదవలేక పోతున్నాను, నాకు స్కాన్ చేయించండి, హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్లండి అని అడిగాను. దాంతో అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. డాక్టర్స్‌ని రిక్వెస్ట్ చేశాను నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉంది అందుకే ఇలా చెప్పాను మా ఇంట్లో వాళ్లకు చెప్పండి అంటే అప్పుడు డాక్టర్స్ తనకి చాలా ప్రెజర్ ఉంది తనను ఇంటికి తీసుకెళ్లి పొండి అని చెప్పారు. అప్పుడు మళ్ళీ వైజాగ్ తీసుకొచ్చారు. అదే సమయంలో ఫస్ట్ లవ్ బ్రేకప్ అవ్వడం, యాక్టింగ్ చాన్సులు రాకపోవడంతో కొంచెం డిప్రెస్ ఫీల్ అయి సూసైడ్ అటెంప్ట్ చేశాను' అని చెప్పుకొచ్చాడు.
ఇక ఫేమ్ వచ్చాక తాను ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకుంటూ.. 'నేను ఏం చేసానో, మీరు ఏం విన్నారో అదేమీ నిజం కాదు. అయింది ఒక కథ అయితే చూపించింది ఇంకో కథ. నేను తప్పు చేయలేదు అని చెప్పట్లేదు కానీ నేను ఒక్కడినే తప్పు చేశాను అన్నట్టు చూపించారు. అన్ని ఒకదాని తర్వాత ఒకటి రావడంతో, నా చుట్టూ ఉన్న నా వాళ్లే నన్ను వదిలేయడంతో నేను డిప్రెషన్‌లో ఉన్నాను. అప్పుడు చెయ్యి కోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాను. నా ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అయ్యారు. నేను హనుమాన్ మీద ఒట్టేసాను నా ఫ్యామిలీని పైకి తీసుకొచ్చేది నేనే' అని ఎమోషనల్‌గా షన్ను చెప్పుకొచ్చాడు. దీంతో షన్ను చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.