Nivetha Thomas: చెన్నైకి వెళ్తున్న నివేదా థామస్.. ఎందుకంటే?
నివేదా థామస్ (Nivetha Thomas), ప్రియదర్శి (Priyadarshi), విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘35-చిన్న కథ కాదు’
దిశ, సినిమా: నివేదా థామస్ (Nivetha Thomas), ప్రియదర్శి (Priyadarshi), విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘35-చిన్న కథ కాదు’ (35-Chinna Katha Kaadu). సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహించాడు. రిలీజ్‌కు ముందు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 5న తెలుగు, మలయాళంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతే కాకుండా.. ప్రజెంట్ ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్ అవతుూ.. అక్కడ కూడా అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం తమిళ (Tamil) వెర్షన్‌కు సిద్ధం అయింది. ఈ విషయాన్ని అఫీషియల్ (Official)గా అనౌన్స్ చేస్తూ నివేదా థామస్ ఓ పోస్ట్ పెట్టింది. ‘మేము చెన్నైకి వస్తున్నాము.. మా తెలుగు సినిమా ‘35- చిన్న కథ కాదు’ మంచి సక్సెస్, అమితమైన ప్రేమ, సపోర్ట్ తర్వాత.. ఇప్పుడు తమిళంలో చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. లైఫ్ అండ్ మ్యాథమెటిక్స్ యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి.. ఈ క్రిస్టిమస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. థియేటర్‌లో కలుద్దాం!’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
35 - CHINNA VISHAYAM ILLE
— Nivetha Thomas (@i_nivethathomas) December 23, 2024
releasing on 25th December in theatres
across Chennai 🙏 pic.twitter.com/PPxtZaQuHm