Manjari Phadnis: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ బ్యూటీ.. ఫొటోలు వైరల్
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు అనేక చిత్రాల్లో నటించి కనుమరుగైపోయే వాళ్ళు కొంతమంది ఉంటే.. తక్కువ సినిమాల్లో నటించి ఇతర కారణాల వల్ల మాయమైపోయేవారు మరికొంతమంది.
దిశ, సినిమా: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు అనేక చిత్రాల్లో నటించి కనుమరుగైపోయే వాళ్ళు కొంతమంది ఉంటే.. తక్కువ సినిమాల్లో నటించి ఇతర కారణాల వల్ల మాయమైపోయేవారు మరికొంతమంది. అలాంటి వారిలో మంజరి ఫడ్నిస్ ఒకరు. ఈ పేరు చెబితే చాలా మందికి గుర్తుకు రాకపోవచ్చు కానీ చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ భామ దర్శకుడు కె. విశ్వనాధ్ తెరకెక్కించిన ‘శుభప్రదం’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెన్ ఎన్టీఆర్ సరసన ‘శక్తి’ మూవీలో నటించి మెప్పించింది. అయితే టాలీవుడ్‌లో ఈ భామకు అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు.
దీంతో హిందీ, మరాఠీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ అక్కడ హీరోయిన్‌గా రాణిస్తోంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇదిలా ఉంటే.. శుభ ప్రదం, శక్తి సినిమాల్లో సంప్రదాయంగా కనిపించిన ఈ భామ.. ప్రస్తుతం గుర్తుపట్టలేనంత హాట్‌గా రెడీ అయింది. అందుకు సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి కాస్త వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. ఏంటి ఈమె ఆమె నా..? మరి ఇంత హాట్‌గా చెంజ్ అయిందేంటి..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోస్‌ను ఓ సారి చూసేయండి.