Allu Arjun : అల్లు అర్జున్ ఇంటికి భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పోలీసులు అల్లు అర్జున్ ఇంటివద్ద భద్రతను పెంచారు. జూబ్లీహిల్స్ పోలీసులు బన్నీ ఇంటికి చేరుకొని, ఘటన వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే ఈ దాడి అనంతరం అల్లు అర్జున్ తన పిల్లలను తన మామ ఇంటికి తరలించినట్టు సమాచారం. సంధ్యా థియేటర్(Sandhya Theater) తొక్కిసలాట ఘటనలో రేవతి(Revathi) చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ(SriTeja) ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రేవతి, శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారని ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. ఫ్లకార్డ్సుతో ఇంటి గేటు ముందు నిరసనకు దిగారు. ఆ తర్వాత నిరసన కారుల్లో కొందరు ఒక్కసారిగా అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు. ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి రాళ్లు, టమాటాలు విసిరారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.