Pushpa-2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్‌స్టార్ పిల్లలు క్యూట్ వ్యాఖ్యలు.. మరోసారి తెలుగు పద్యం చెప్పిన అర్హ..!
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) నటించిన ‘పుష్ప-2’(Pushpa-2) ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిన్న(డిసెంబరు 2) హైదరాబాదు(Hyderabad)లో గ్రాండ్‌గా నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) నటించిన ‘పుష్ప-2’(Pushpa-2) ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిన్న(డిసెంబరు 2) హైదరాబాదు(Hyderabad)లో గ్రాండ్‌గా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌తో పాటు తన పిల్లలు అయాన్(ayan), అర్హ(arha) కూడా వెళ్లారు. అక్కడ వీరు స్టేజీపై క్యూట్ క్యూట్ మాటలతో జనాల్ని ఆకట్టుకున్నారు. ఐకాన్ స్టార్ కుమారుడు అయాన్ మాట్లాడుతూ.. ముందుగా అందరికీ నమస్కారం అని అన్నాడు. ఎలా ఉన్నారు..? ప్రేక్షకులందరికీ తప్పకుండా తన డాడీ మూవీ నచ్చుతుందని తెలిపాడు. చివరకు తగ్గేదెలే అని అల్లు అర్జున్ డైలాగ్ చెప్పాడు. ఇక అర్హ పాప కూడా అందకిరీ నమస్కారం అని చెప్పింది. తర్వాత రీసెంట్‌గా బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షో(Unstoppable Talk Show) లో పొల్లు పోకుండా చెప్పిన అర్హ.. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చక్కగా చెప్పేసింది. ‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ(Atajani Kanche Bhumisuru Dambara Chumbi Shirassarajjhari)..’ అంటూ బన్నీ గారాల పట్టి స్టేజీపై భయం లేకుండా చాలా సింపుల్‌గా చెప్పింది. క్యూట్ గా చెప్పిన పద్యం విని నెటిజన్లు అర్హను కొనియాడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.