‘లక్కీ భాస్కర్’ మూవీపై హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar).

Update: 2024-10-28 13:59 GMT

దిశ, సినిమా: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Malayalam star Dulquer Salmaan), డైరెక్టర్ వెంకీ అట్లూరి(Director Venky Atluri) కాంబోలో వస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar). ఇందులో మీనాక్షి చౌదరి (Heroine Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించింది మీనాక్షి చౌదరి.

‘‘లక్కీ భాస్కర్’లో భాగం కావడం నాకు సంతోషంగా ఉంది. సితార సంస్థ నన్ను కుటుంబసభ్యురాలిలా చూస్తుంది. ఈ అవకాశమిచ్చిన చినబాబు, వంశీకి కృతఙ్ఞతలు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరితో కలిసి వర్క్ చేయడం అనేది మంచి అనుభూతి. మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే మంచి కథలు చేయాలి, మంచి టీంతో పని చేయాలి. వయసుకు తగ్గ పాత్రలే చేయాలనే పరిమితిని నటులు పెట్టుకోకూడదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటీనటులకు కాదు, ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుంది. అందుకే నటిగా పాత్రల ఎంపికలో వైవిద్యం చూపించాలని అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగానే సినిమాలను ఎంచుకుంటున్నాను. ఇది కథా బలమున్న సినిమా. అందుకే సినిమాపై ముందు నుంచి మేమందరం ఎంతో నమ్మకంగా ఉన్నాము. ట్రైలర్ విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి మా కల నిజమవుతుందని ఆనందం కలిగింది. ఇదొక అద్భుతమైన మూవీ. కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News