Brahmamudi : కోడలిని మెచ్చుకున్న అపర్ణా దేవి
పస్తులుండి అయిన ఇంటి పరువును కాపాడుకోవాలి.
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
మీరు చెప్పేదానిలో నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు.. ఆకలి అన్నవారికి లేదనకుండా అన్నంపెట్టే నువ్వు నీ ఇంట్లో నువ్వు ఇలా చేస్తున్నావంటే.. దాని వెనుక ఏదో కారణం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు ఈ ఇంట్లో అందరికీ నచ్చకపోవచ్చు, నిన్ను అర్ధం చేసుకోరు కూడా.. కానీ, నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే.. ఇప్పటికి నిన్ను, నా కొడుకును కలపడానికి చాలా ఆరాటపడుతున్నాను. కుటుంబ గౌరవం కాపాడటమంటే లక్షలు ఖర్చు చేసి విచ్చలవిడిగా తిరగడం కాదని అపర్ణా దేవి అంటుంది. కావ్య అత్త మాటలను వింటూ ఉంటుంది.
అయినా ఆపదు .. అపర్ణా దేవి కావ్యతో మాట్లాడుతూనే ఉంటుంది. ‘పస్తులుండి అయిన ఇంటి పరువును కాపాడుకోవాలి. ఆ లక్షణం నీలో ఉంది. నీకు నచ్చింది చెయ్.. ఇంటి విషయంలో ఇలా మారావంటే.. అది ఇంటి గౌరవానికి సంబంధించిందే అని నాకు అర్ధమవుతుంది. ఏదో సమస్య వచ్చిందని ఇప్పుడే తెలుస్తుంది. కానీ మాతో ఇంత వరకు చెప్పలేదు. మాకు చెప్పేదే అయితే ఎప్పుడో చెప్పేసేదానివే.. అందుకే నేను కూడా అడగలేదు’ అని అంటుంది అపర్ణా. ‘అవును అత్తయ్యా.. మీరు చెప్పిన దానిలో నిజం ఉంది. దాని వెనుక బలమైన కారణం కూడా ఉంది’ అని కావ్య అంటుంది.