సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి హాజరుకాని చిరంజీవి.. అసలు కారణం ఇదే!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth)తో సినీ ప్రముఖుల సమావేశం ఇవాళ(గురువారం) కమాండ్ కంట్రోల్ రూమ్ ఆఫీస్‌లో జరిగిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth)తో సినీ ప్రముఖుల సమావేశం ఇవాళ(గురువారం) కమాండ్ కంట్రోల్ రూమ్ ఆఫీస్‌లో జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్(FDC) చైర్మన్ దిల్ రాజు(Dil Raju) ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. మొత్తం 46 మంది సినీ ప్రముఖులు ఈ సమావేశానికి హాజరు కాగా.. ఇండస్ట్రీ తీసుకోవాల్సిన పలు చర్యలపై సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరయ్యారు.
ఇక సినీ ఇండస్ట్రీ నుంచి.. నాగార్జున, వెంకటేష్, దిల్ రాజు, మురళీమోహన్, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, నితిన్, శివ బాలాజీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ, పలువురు నిర్మాతలు, 'మా' అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్‌కు చెందిన పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దిల్ రాజు స్వయంగా చిరంజీవిని(Megastar Chiranjeevi) ఆహ్వానించారని తెలుస్తోంది. కానీ తాను చెన్నైలో షూటింగ్లో ఉండడంతో రాలేనని చెప్పారట. ఈ నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad)లో లేకపోవడం వల్లే సమావేశానికి చిరంజీవి రాలేకపోయారని తెలుస్తోంది.
Read More...
CM Revanth Reddy: ఇండస్ట్రీ ప్రముఖులతో ముగిసిన భేటీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు