Natural Star Nani: స్టైలిష్ గెటప్‌లో నేచురల్ స్టార్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘HIT: The 3rd Case’.

Update: 2024-12-26 08:09 GMT

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘HIT: The 3rd Case’. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రం భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. తాజాగా క్రిస్మస్ సందర్భంగా బుధవారం నాని కొత్త లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేశారు. అందులో నేచురల్ స్టార్ మంచు పర్వతాల్లో స్టైలిష్ గెటప్‌లో గుర్రాన్ని పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇదొక భిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. అర్జున్ సర్కార్‌గా నాని శక్తి వంతమైన పోలీసు పాత్రలో కనువిందు చేయనున్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఎంతగానో ఆకట్టుకుంటుంది.   

Tags:    

Similar News