Anasuya: ప్రజెంట్ నేను ఏ మూడ్‌లో ఉన్నానో చెప్పండంటూ షాకింగ్ ఫొటో షేర్ చేసిన రంగమత్త.. పోస్ట్ వైరల్

జబర్దస్త్ షోలో యాంకర్‌గా తన కెరీర్ స్టార్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-16 04:01 GMT

దిశ, సినిమా: జబర్దస్త్ షోలో యాంకర్‌గా తన కెరీర్ స్టార్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆడియన్స్‌ ఎప్పుడూ చూడని అనసూయని చూపించింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అలా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణిగా నెగిటివ్‌ రోల్‌లో మెప్పించింది. ఈ మూవీలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్‌గా వచ్చిన ‘పుష్ప2’లో కూడా తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే మరికొన్ని సినిమాల్లో మెయిన్ పాత్రలో నటించి మెప్పించింది.

ఇక ఈమె నిత్యం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అనసూయ ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. బాగా అలసిపోయి, నిద్ర కోసం కొట్టు మిట్టాడుతున్నట్టుగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ప్రజెంట్ నేను ఏ మూడ్‌లో ఉన్నానో చెప్పండి అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చింది. అందులో ఫస్ట్ వన్ కోపంగా ఉన్నా, రెండవది కోపమొచ్చింది, మూడోవది నిద్ర కరువైంది, నాలుగు పైన ఉన్నవన్నీ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమకు అనిపించిన ఆప్షన్‌తో రిప్లై ఇస్తున్నారు.

Tags:    

Similar News