Allu Aravind : మాస్ స్టెప్పులు వేసిన అల్లు అరవింద్

ప్రముఖ తెలుగు నిర్మాత, గీతా ఆర్ట్స్(Geetha Arts) అధినేత అల్లు అరవింద్(Allu Aravind) మాస్ స్టెప్పులు వేశారు.

Update: 2025-01-23 17:39 GMT
Allu Aravind : మాస్ స్టెప్పులు వేసిన అల్లు అరవింద్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ తెలుగు నిర్మాత, గీతా ఆర్ట్స్(Geetha Arts) అధినేత అల్లు అరవింద్(Allu Aravind) మాస్ స్టెప్పులు వేశారు. గురువారం హైదరాబాద్ లో "తండేల్" (Thandel) సినిమాలోని 'హైలెస్సో హైలెస్సా'(Hailesso Hailessa) అంటూ సాగే థర్డ్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సాంగ్ విడుదల చేశాక.. ఆ పాటకు కొందరు కాలేజీ విద్యార్థులు స్టేజి మీద డ్యాన్స్ చేయగా.. అల్లు ఆరవింద్ కూడా ఉత్సాహంగా వారితో స్టెప్పులేశారు. హీరో నాగచైతన్య(Naga Chaithanya), దర్శకుడు చందూ మొండేటి(Chandu Mondeti) చప్పట్లు, విజిల్స్ వేస్తూ ఆయనను ఎంకరేజ్ చేయడం గమనార్హం. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallavi) లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్ అందిస్తుండగా.. బన్నీ వ్యాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Tags:    

Similar News