Dharma Yugam: సోషల్ రెస్పాన్సిబిలిటీని ప్రతిభింబిస్తున్న ‘ధర్మ యుగం’..
భిక్షాటన రహిత ప్రపంచాన్ని సాధించాలనే సందేశాన్ని తెలిపేలా ‘ధర్మ యుగం’ (Dharma Yugam) పేరుతో సందేశాత్మక పాటను లాంచ్ చేశారు స్ఫూర్తి విజేత విద్యా సంస్థలు.

దిశ, సినిమా: భిక్షాటన రహిత ప్రపంచాన్ని సాధించాలనే సందేశాన్ని తెలిపేలా ‘ధర్మ యుగం’ (Dharma Yugam) పేరుతో సందేశాత్మక పాటను లాంచ్ చేశారు స్ఫూర్తి విజేత విద్యా సంస్థలు. హైద్రాబాద్(Hyderabad)లోని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ‘ధర్మ యుగం: హ్యూమానిటీ బెగ్గర్ ఫ్రీ సిటీ’ సాంగ్‌ను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వందే మాతరం శ్రీనివాస్ (Srinivas) సామాజిక బాధ్యతను చాటుకునేందుకు ఈ పాటను రూపొందించారన్నారు. ఈ సాంగ్ ద్వారా అందరు కలిసి సమాజాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చవచ్చు అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల సామాజిక బాధ్యతగా చేస్తున్న ఆయన కృషిని గుర్తిస్తూ అవార్డ్స్‌తో సత్కరించారు. అనాధలకు లాస్ట్ రైట్స్ నిర్వహిస్తున్న ఎన్ జీవో, బిక్షాటన రూపు మాపేందుకు కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థలు, పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న డాక్టర్స్‌ను అవార్డులతో సన్మానించారు. బెగ్గర్ ప్రీ సొసైటీ క్రియేట్ చేసేందుకు విజేత పూర్వ విద్యార్థులు కలిసి సమాజంలో అవగాహన కల్పించడం సంతోషంగా ఉందన్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ(Social Responsibility)ని ప్రదర్శిస్తున్న ధర్మ యుగం పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.