మిత్ర ద్రోహులు అన్ని చోట్లా ఉంటారు.. షాకింగ్‌గా టాలీవుడ్ హీరో పోస్ట్

హీరో శ్రీవిష్ణు(SreeVishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’(Single).

Update: 2025-03-20 14:49 GMT
మిత్ర ద్రోహులు అన్ని చోట్లా ఉంటారు.. షాకింగ్‌గా టాలీవుడ్ హీరో పోస్ట్
  • whatsapp icon

దిశ, సినిమా: హీరో శ్రీవిష్ణు(SreeVishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’(Single). ‘నిను వీడని నీడను నేనే’ ఫేం కార్తీక్ రాజు(Karthik Raju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. ఇందులో హీరో సింగిల్‌గా ఉండటానికి ఇష్టపడతాడు.. కానీ అతడిని ఇద్దరు లవ్ చేస్తుంటారు. దీంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా మరో విచిత్రమైన అప్‌డేట్ ఇచ్చాడు విష్ణు. తన సోషల్ మీడియా అకౌంట్ X ద్వారా ఓ పోస్టర్ షేర్ చేశాడు.

‘మిత్ర ద్రోహులు అన్ని చోట్లా ఉంటారు.. అలాగే ప్రతి గ్యాంగ్‌లో కూడా అలాంటి ఓ ఫ్రెండ్ ఉంటాడు. అలాంటి ఓ ‘సింగిల్’ ఫ్రెండ్‌కు ట్యాగ్ చెయ్యండి.. ఎంటర్‌టైన్మెంట్ పంచడానికి మే లో వచ్చేస్తున్నాం’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్‌లో వెన్నెల కిషోర్ (Vennela Kishor) అండ్ శ్రీ విష్ణు ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఇక ఆ పోస్టర్‌పై.. ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు సింగిల్.. బయట అయితే అమ్మాయిలతో మింగిల్ అనే ఉద్దేశ్యం వచ్చేలా ఇచ్చిన క్యాప్షన్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News