హీరో పాత్రకు స్టైల్ తీసుకొచ్చిందే ఆయన.. ఆ స్టార్ హీరోపై సిద్ధు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘జాక్’(Jack).

దిశ, సినిమా: హీరో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘జాక్’(Jack). వైష్ణవి చైతన్య (Vaishnavi Chaithanya) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం మూవీ నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘జాక్’ నుంచి యూత్‌ఫుల్ సాంగ్ ‘కిస్ సాంగ్’ను విడుదల చేశారు. ఈ పాట లాంఛ్ ఈవెంట్‌లో మీడియాతో ముచ్చటించిన సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్ చేసే అవకాశం ఉందా? అని అడిగితే.. ‘ఆయన ‘ఆరెంజ్’ సినిమాలో నటించాను. భవిష్యత్తులో అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను. రామ్‌చరణ్(Ramcharan)తో నటించడం నాకు ఇష్టం’ అని చెప్పారు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘ఖుషి’లో ఒక స్టైల్ ఉంటుంది. మళ్లీ అలాంటి స్టైల్ మీ సినిమాల్లో కనిపిస్తుంది.. ఎలా అనిపిస్తుంది? అని అడిగిన ప్రశ్నకు.. ‘ఆయనతో నన్ను పోల్చడమే నాకు ప్రశంసతో సమానం. సినిమాల్లో హీరో పాత్రకు ఒక స్టైల్ తీసుకువచ్చింది పవన్‌కల్యాణే. ఆయనలా నేను కనిపించడం ప్లాన్ చేసుకున్నది కాదు. నాకు తెలిసినట్లు నటించాను. అలా గుర్తింపు వచ్చిందంతే’ అని చెప్పుకొచ్చాడు సిద్ధు.