Rana Daggubati : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు.. రానా టీం వివరణ
ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting Apps Pramotion Case) సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ డెస్క్ : ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting Apps Pramotion Case) సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ నటుల పేర్లు బయటికి రాగా.. వారందరికీ నోటీసులు పంపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ కేసులో టాలీవుడ్ టాప్ నటులైన రానా దగ్గుబాటి (Rana Daggubati), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి (Lakshmi Manchu), అనన్య నాగల్ల ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రచారంపై విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వివరణ ఇవ్వగా.. తాజాగా రానా వంతైంది. ఈ వ్యవహారంపై రానా టీం వివరణ ఇచ్చింది. రానా స్కిల్ బేస్డ్ గేమ్ యాప్స్ కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా చేశారని పేర్కొన్నారు. అది కూడా కొన్ని ప్రాంతాలకె పరిమితం అని, అన్నీ లీగల్ అనుమతులు చెక్ చేశాకే రానా ప్రచారం చేశారని ఆయన టీం వివరణ ఇచ్చింది.
కాగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన పలువురు సెలెబ్రెటీలు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్(YouTube Influencers)పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో వారిని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. రాష్ర్టంలో బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ను ఎవ్వరు ప్రమోట్ చేసిన కేసులు నమోదు చేస్తామని, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయాల్ స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాధించవచ్చని, షార్ట్ టర్మ్ లో ధనవంతులు అవ్వచ్చని యువత బెట్టింగ్ యాప్ లలో పెద్ద మొత్తంలో పోగుట్టుకుంటున్నారని పలు ఫిర్యాదు అందాయని తెలిపారు. ఇటువంటి యాప్స్ మోసాలకు యువత బలి కావద్దని, లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.