హసన్ పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం

హనుమకొండ జిల్లా హసన్ పర్తి పెద్ద చెరువు మూలమలుపు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2025-03-23 15:33 GMT
హసన్ పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం
  • whatsapp icon

దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్ పర్తి పెద్ద చెరువు మూలమలుపు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొట్టడంతో బైక్​పై ఉన్న దుర్గం పవన్, పౌతు మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హసన్ పర్తి నుండి సీతంపేటకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాంతో హనుమకొండ నుండి కరీంనగర్ వెళ్లే హైవేపై భారీగా ట్రాఫిక్ జామైంది. ఈ విషయం తెలుసుకున్న హసన్ పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.    


Similar News