Gopichand: సరికొత్త జోనర్‌లో గోపిచంద్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?
మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) గతేడాది ‘భీమా’, ‘విశ్వం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దిశ, సినిమా: మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) గతేడాది ‘భీమా’, ‘విశ్వం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అవి అంతగా సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇక ప్రజెంట్ ఆయన విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి (Visionary Director Sankalp Reddy) దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్(Exciting project)ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీని తాజాగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ మూవీలో గోపీచంద్ నెవర్ బిఫోర్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే 7వ శతాబ్ద కాలం నాటి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం భారతీయ వారసత్వం మరచిపోయిన అధ్యాయానానికి జీవం పోస్తుందని తెలుస్తుండటంతో.. మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే గోపీ చంద్ నెక్ట్స్ చిత్రాని(Next Movie)కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఫిలిమ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. గోపీచంద్‌కు కుమార్ (Kumar) అనే కొత్త దర్శకుడు మంచి కాన్సెప్ట్ (Good concept), కొత్త జానర్‌లో ఒక కథ చెప్పారంట. ఈ కథ గోపీచంద్‌కు నచ్చినట్లు తెలుస్తోంది. అలాగే అన్నీ కుదిరితే ఈ సినిమాను #SVCC పై BVSN ప్రసాద్ నిర్మించే అవకాశం ఉన్నట్లు టాక్. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.