మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంలో మరో కీలక ట్విస్ట్
తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం వారం రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది.
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు(mohanbabu) ఫ్యామిలీ వివాదం(Family conflict) వారం రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ వివాదంలో రోజుకో ట్విస్ట్(Twist) నెలకొంటుంది. మంచు ఫ్యామిలీ వివాదంను కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేయడం.. దానికి అందరూ ఖండించడం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును కలిసి మోహన్ బాబు క్షమాపణలు చెప్పడం జరిగింది. కాగా ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. సోమవారం మంచు మోహన్‌బాబు PRO సహా.. ఆరుగురికి బౌన్సర్లకు 41ఏ నోటీసులు(41A notices) జారీ చేశారు. ఈనెల 9న మోహన్‌బాబు యూనివర్సిటీలో కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై దాడి జరిగింది. కాగా ఈ దాడిలో గాయపడిన రిపోర్టర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ రోజు నోటీసులు జారీ చేశారు.