‘చైనా భారత భూభాగాన్ని ఆక్రమించింది’
న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణలపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణం ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రతను రాజకీయం చేయొద్దని హితవు పలికారు. 1962 యుద్ధం తర్వాత 45వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిన విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. భారత భూభాగాన్ని ప్రధాని మోడీ చైనాకు వదిలిపెట్టారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేసిన నేపథ్యంలో శరద్ పవార్ ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. లడాఖ్ […]
న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణలపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణం ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రతను రాజకీయం చేయొద్దని హితవు పలికారు. 1962 యుద్ధం తర్వాత 45వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిన విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. భారత భూభాగాన్ని ప్రధాని మోడీ చైనాకు వదిలిపెట్టారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేసిన నేపథ్యంలో శరద్ పవార్ ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. లడాఖ్ ఘర్షణలకు ఇంత తొందరగా రక్షణ మంత్రి వైఫల్యంగా చిత్రించొద్దని, భారత సైన్యం అలర్ట్‌గా ఉండి గస్తీ కాస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నదనని వివరించారు. ఘర్షణల్లో చైనానే రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించిందని, ఈ వ్యవహారమంతా సున్నితమైనది కాబట్టి రాజకీయం చేయవద్దని సూచించారు.