కేటీఆర్ సార్.. మా కాలనీలో సీసీ రోడ్లు వేయించండి (వీడియో)
దిశ, వేములవాడ : ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు ఇవ్వడం, గెలిచాక వాటిని మర్చిపోవడం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారింది. దాదాపు 40 ఏళ్ల కిందట ఏర్పడిన తమ కాలనీలో ఇప్పటికీ సీసీ రోడ్డు లేదని తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని, చిన్నారులు ఇద్దరూ కలిసి తమ కాలనీలో రోడ్డు వేయించాలని వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇచ్చిన హామీలు తీర్చలేదని, కేటీఆర్ సార్ మా కాలనీకి సీసీ రోడ్లు వేయాలంటూ ప్లకార్డులతో రోడ్డు […]
దిశ, వేములవాడ : ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు ఇవ్వడం, గెలిచాక వాటిని మర్చిపోవడం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారింది. దాదాపు 40 ఏళ్ల కిందట ఏర్పడిన తమ కాలనీలో ఇప్పటికీ సీసీ రోడ్డు లేదని తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని, చిన్నారులు ఇద్దరూ కలిసి తమ కాలనీలో రోడ్డు వేయించాలని వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇచ్చిన హామీలు తీర్చలేదని, కేటీఆర్ సార్ మా కాలనీకి సీసీ రోడ్లు వేయాలంటూ ప్లకార్డులతో రోడ్డు మీద గల బురదలో దిగి తమ తల్లిదండ్రుల ఆవేదనను రాష్ట్ర స్థాయిలో తెలిసేలా నిరసన తెలిపారు.
వివరాల్లోకెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలోని దళిత వాడలో జాన్సన్, బ్లేస్సి అనే ఇద్దరు చిన్నారులు సీసీ రోడ్డు కోసం బురద రోడ్డులో దిగి ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలిపారు. కేటీఆర్ సార్ మా దళితవాడలో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాలని, తాము చిన్నతనం నుండి ఈ బురద నీటిలో నుండే పాఠశాలకు పోతున్నామన్నారు. వేములవాడ నియోజకవర్గం కొనరావుపేట మండలంలోని ప్రజా పతినిధులను ఈ విషయమై ఎన్ని సార్లు వేడుకున్నా మా దళితవాడను అభివృద్ధి చేస్తలేరన్నారు.
1983లో దళితవాడ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఏ ప్రభుత్వమూ మా కాలనీని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఓట్లప్పుడే మా కాలనీకి వచ్చి గెలిచాక మా ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్ మా కాలనీ వైపు తిరిగి చూడలేదన్నారు. కేటీఆర్ సార్ మీరన్న మా కాలనీలో CC రోడ్లు, డ్రైనేజీ, పార్క్ నిర్మాణం చేపట్టాలన్నారు. నీటి సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోందన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమంలో వైరల్ అవుతుంది. మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఈ చిన్నారుల చేసిన ఈ సాహసంపై మంత్రి కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.