కొబ్బరికాయ కొట్టిన "చేతక్ శీను’’

దిశ, వెబ్‌డెస్క్ : ‘చూసీ చూడంగానే’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం “గమనం” వంటి డిఫరెంట్ మూవీలో విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2021 ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అలాగే శివ కందుకూరి మను చరిత్ర అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. మను చరిత్ర షూటింగ్ మరొక షెడ్యూల్ మిగిలి ఉంది. తాజాగా శివ కందుకూరి మరో […]

Update: 2020-12-25 11:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ‘చూసీ చూడంగానే’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం “గమనం” వంటి డిఫరెంట్ మూవీలో విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2021 ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అలాగే శివ కందుకూరి మను చరిత్ర అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. మను చరిత్ర షూటింగ్ మరొక షెడ్యూల్ మిగిలి ఉంది.

తాజాగా శివ కందుకూరి మరో అల్టిమేట్ కథతో “చేతక్ శీను ” వంటి వెరైటీ టైటిల్ తో సినిమా చేయబోతున్నారు. ఇది శివ కందుకూరి నాలుగవ చిత్రంగా ఉండబోతోంది. రవి ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1చిత్రంగా రవి చరణ్ మెరుపో, ప్రతిమ సంయుక్తంగా నిర్మిస్తున్న “చేతక్ శీను ” డిసెంబర్ 25న ఆ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ‘కథనం’ వంటి హిట్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ఇప్పటివరకు తెలుగు తెరపై రానటువంటి కథాంశంతో కామిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 18నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

మెలోడీ మాస్టర్ అనూప్ రూబెన్స్ “చేతక్ శీను ” చిత్రానికి అత్యద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మళ్లీరావా, కరెంట్ తీగ మొదలగు చిత్రాలకి ఫోటోగ్రఫీని అందించిన సతీష్ ముత్యాల ఈ చిత్రానికి బ్యూటిఫుల్ విజువల్స్ అందించనున్నారు. అలాగే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన ఎం.ఆర్.వర్మ ఈ సినిమాకి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ పాల్గొని చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

Tags:    

Similar News