Christmas Gift : క్రిస్మస్‌కి గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారా..? బెస్ట్ ఐడియాస్ ఇవిగో!

Christmas Gift : క్రిస్మస్‌కి గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారా..? బెస్ట్ ఐడియాస్ ఇవిగో!

Update: 2024-12-24 14:08 GMT

దిశ, ఫీచర్స్ : ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. అయితే ఈ పర్వదినాన చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది బహుమతులు. సాంటాక్లాజ్, క్రిస్మస్ ట్రీ, ఇంకా రకరకాల గిఫ్ట్‌లు ఇచ్చి సర్‌ప్రైజ్ చేయడం ఈ ఫెస్టివల్ స్పెషాలిటీ. కాగా ఇందుకు భిన్నంగా తమ స్నేహితులకు, సన్నిహితులకు ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని కూడా కొందరు ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి కొందరు నిపుణులు సూచిస్తన్న బెస్ట్ ఐడియాస్ ఏంటంటే.. ఈ రోజుల్లో మేకప్ అంటే అందరూ ఇష్టపడుతుంటారు. కాబట్టి మీ సిస్టర్స్‌కి, మదర్స్‌కి, పార్ట్‌నర్స్‌కి మేకప్ బాక్స్, మేకప్ ప్రొడక్ట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయవచ్చు. అలాగే మంచి సువాసనగల పెర్ఫ్యూమ్స్ కూడా బహుమతిగా ఇస్తే పండుగరోజు ఇల్లాంతా సందడిగానే కాదు, పరిమళ భరితం కూడా అవుతుంది. ఇవేకాకుండా పుస్తకం, డైరీ, స్మార్ట్ వాచ్, డ్రై ఫ్రూట్స్, ల్యాప్‌టాప్ బ్యాగ్ ఇలా ఏవైనా గుర్తుండిపోయే బహుమతులు ఇచ్చి ఫెస్టివల్‌ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. 

Tags:    

Similar News