లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి: రాజీవ్ గౌబా

దిశ, మెదక్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రపతి కార్యాలయం నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు , డీజీపీలు, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నుంచి ఎస్పీ జోయల్ డేవిస్, అదనపు కలెక్టర్ పద్మాకర్ పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులపై వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో రాజీవ్ గౌబా చర్చించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న […]

Update: 2020-04-25 06:49 GMT

దిశ, మెదక్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రపతి కార్యాలయం నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు , డీజీపీలు, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నుంచి ఎస్పీ జోయల్ డేవిస్, అదనపు కలెక్టర్ పద్మాకర్ పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులపై వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో రాజీవ్ గౌబా చర్చించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవిష్యత్తు ప్రణాళికలపైన పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను ప్రతి రాష్ట్రం కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. చివరగా వలస కూలీలు, వారి స్థితిగతులు, సమస్యలపై ఆరా తీశారు.

Tags: video conference, with central cabinet secretary rajeev guba, siddipet collector and sp

Tags:    

Similar News